చర్మం రంగును బట్టి వర్గీకరిస్తారా.. కాంగ్రెస్ నేత పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

by Disha Web Desk 12 |
చర్మం రంగును బట్టి వర్గీకరిస్తారా.. కాంగ్రెస్ నేత పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని వరంగల్ లో ఈ రోజు బీజేపీ ఎన్నికల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతపై విరుచుకుపడ్డారు. మేము ఆదివాసి బిడ్డ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేస్తామంటే కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించిందో అప్పుడు మాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజు అమెరికాలో రాహుల్ గాంధీ అంకుల్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా అర్ధం అయింది. ఆయన చర్మం రంగు నల్లగా ఉండేవారి ఆఫ్రికా వారని అన్నారు. ఈ విషయం నాకు అత్యంత కోపం తెప్పించింది. దేశంలోని ప్రజల చర్మం రంగును బట్టి ప్రజలు వర్గీకరిస్తారా..? నేను ఉన్నంతవరకు అలా జరగనివ్వాను అంటూ ప్రధాని మోడీ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. కాగా ఈ రోజు కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా మాట్లాడుతూ.. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు భిన్నంగా ఉంటారని, తూర్పున ఉన్న ప్రజలు చైనీయులు గా కనిపిస్తారు. పశ్చిమంలో ప్రజలు అరబ్‌లా కనిపిస్తారు. ఉత్తరాది ప్రజలు తెల్లవారిలా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్‌లా కనిపిస్తారంటూ వివాదాస్సద వ్యాఖ్యలు చేశారు.

Read More...

నాకు పార్టీ ముఖ్యం పార్టీ లైన్ ముఖ్యం.. అదే నన్ను కాపాడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

Next Story