‘ఎమ్మెల్యే సారు.. జర ఈ బుర‌ద రోడ్లను బాగుచేయండి’

by  |
Venkatraopally roads
X

దిశ, టేకుమట్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని రోడ్డు అధ్వానంగా త‌యారైంది. వ‌ర్షం కురిస్తే మోకాళ్లలోతు దిగ‌బ‌డుతోంది. ఓ మోస్తరు వర్షానికి చిత్తడిగా మారుతోంది. దీంతో రోడ్డుపై ప్రయాణించడానికి వాహనదారులు బస్సు డ్రైవర్లు భయపడుతున్నారు. ఈ బురదలోంచి వెంకట్రావు పల్లి నుంచి రామకృష్ణాపూర్ వరకు ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. ఆర్అండ్‌బీ అధికారులు కనీస మరమ్మతులు చేయ‌కుండా వ‌దిలేస్తున్నారంటూ వెంకట్రావుపల్లి, బూర్ణప‌ల్లి, ద్వారకపేట గ్రామస్థులు విమ‌ర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కన ఇంటర్నెట్ వైర్లు వేయడంతో మరింత గుంతలమయం అయింది.

ఇటీవ‌ల ఈ గుంతల్లో పడిన ప‌లువురు వాహ‌న‌దారులు గాయ‌ప‌డ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ‘‘ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి సారు, జర మా పరిస్థితి చూడండి’’ అంటూ వేడుకుంటున్నారు. వెంటనే ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మ‌ర‌మ్మతులు నిర్వహించేలా చ‌ర్యలు తీసుకోకుంటే బుర‌ద రోడ్లపై ధ‌ర్నాల‌కు దిగుతామ‌ని హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed