వేలమందితో వరల్డ్ రికార్డ్ సృష్టించిన మ్యూజిక్ ఆర్కెస్ట్రా

by  |
rk-stra
X

దిశ, ఫీచర్స్: వెనిజులాకు చెందిన ‘నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూత్ అండ్ చిల్డ్రన్స్ ఆర్కెస్ట్రాస్’ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. వేల మంది మ్యూజిషియన్స్‌ ఒకేసారి ఆర్కెస్ట్రా వాయించి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్కెస్ట్రాగా గిన్నిస్ రికార్డ్ నెలకొల్పినట్లు ఆ దేశ ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. 1975లో స్థాపించబడిన వెనిజులా ప్రజాసంక్షేమ నిధి ‘ఎల్ సిస్టెమా’ ఆధ్వర్యంలో మ్యూజిషియన్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సంస్థ వేలాది మంది శ్రామిక వర్గానికి చెందిన పిల్లలకు సంగీత శిక్షణ అందిస్తుంది. ‘పారిస్ ఒపెరా, లాస్ ఏంజిల్స్ ఫిల్హార్మోనిక్’ వంటి పాపులర్ ప్రోగ్రామ్స్‌ కండక్ట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్‌ గుస్తావో డుడామెల్ ‘ఎల్ సిస్టెమా’ పూర్వ విద్యార్థుల్లో ఒకరు కావడం విశేషం.

సైమన్ బొలివర్ మ్యూజిక్ ఆర్కెస్ట్రాలో ప్రధాన సభ్యులుగా ఉన్న పిల్లలు, పెద్దలు సహా 12,000 మంది సంగీతకారులు ఈ నెల 13న నమోదైన రికార్డ్ ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ ప్లే చేశారు. అయితే గిన్నిస్ సంస్థ జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం.. 8,573 మందిని మాత్రమే రికార్డు సృష్టించినట్లు గుర్తించింది. అకౌంటింగ్ సంస్థ KPMG నుంచి దాదాపు 260 మంది ఆడిటర్లు ఈ భారీ మ్యూజిక్ కన్సర్ట్‌ను పరిశీలించారు. ప్రతీ మ్యూజిషియన్ కొత్త రికార్డును నెలకొల్పేందుకు గాను అవసరమైన నియమాలకు కట్టుబడి ఉండేలా చూసుకున్నారు. ఇది ‘ఎల్ సిస్టెమా’కే కాకుండా దేశానికే గర్వకారణమని ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎడ్వర్డో మెండెజ్ అన్నారు. కాగా ఈ విభాగంలో గత రికార్డు రష్యాలో నమోదైంది. 2019లో 8,000 మంది సంగీతకారులు వారు ఈ రికార్డు నెలకొల్పారు.


Next Story

Most Viewed