ఔరా.. కరోనా టీకాలు ఇలా కూడా వేస్తారా..?

by  |
Corona Vaccine
X

దిశ, పాలేరు: గ్రామంలోని ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు గ్రామపంచాయతీ నడుం బిగించింది. ఇంటింటికి టీకాలు వేసి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు పూనుకుందిన ఇందులో భాగంగా కరోనా టీకాలు ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని వినూత్న తరహాలో ప్రచారం నిర్వహించింది. నేలకొండపల్లి మండలంలోని కోనాయిగూడెంలో సొసైటీ అధ్యక్షుడు కోటి సైదారెడ్డి, సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, రైతు కన్వీనర్ మేకల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి కొవిడ్ టీకాలు వేసుకోవాలని గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో టీకా వేయించుకోని వారి ఇళ్లకు వెళ్లి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి, గులాబీ పువ్వులు అందించి టీకాలు వేయించుకోవాలని కోరారు. విన్నూత ప్రచారంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అనంతరం సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ మాట్లాడుతూ వంద శాతం టీకాలు పూర్తి చేసిన గ్రామంగా కోనాయిగూడెంను నిలపాలని గ్రామస్తులను కోరారు. రాష్ట్రంలో ఫస్ట్, సెకండ్ వేవ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారన్నారు. తప్పకుండా అందరూ బాధ్యతగా టీకా వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాగమణి, ఉపేంద్రమ్మ, అంగన్వాడీ టీచర్ నాగమణి, గ్రామదీపిక పుల్లమ్మ, ఆశ కార్యకర్త బేబీ, ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు వడ్లమూడి వెంకటేశ్వర్లు, వడ్లమూడి గురవయ్య, చింతమళ్ల సందీప్, మందుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed