15వరకు వరవరరావు ఆస్పత్రిలోనే!

by  |
15వరకు వరవరరావు ఆస్పత్రిలోనే!
X

దిశ, క్రైమ్ బ్యూరో : విరసం నేత వరవర రావు ఆరోగ్య నివేదికను ముంబయి హైకోర్టుకు నానావతి ఆస్పత్రి సూపరింటెండెంట్ అందజేశారు. వరవర రావు ఆరోగ్య పరిస్థితిపై ముంబయి హైకోర్టు శుక్రవారం విచారించింది. కుటుంబ సభ్యులకు తెలుపకుండా ఆస్పత్రి నుంచి ఆయనను డిశ్చార్జ్ చేయవద్దని కోర్టు తెలిపింది. ఆయన ఆరోగ్యంపై తిరిగి 15న విచారిస్తామని, అప్పటి వరకూ వరవర రావును ఆస్పత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.

ఫ్యామిలీ విజిట్, కోర్టుకు చెప్పకుండా డిశ్చార్జ్ చేయడం లాంటి తదితర పాత షరతులు వర్తించాలని అడ్వకేట్ ఇందిరా కోరగా అందుకు హైకోర్టు అంగీకరం తెలిపింది. కాగా ఆస్పత్రి రిపోర్టు తమకు అందలేదని ఎన్ఐఏ తెలిపింది. అయితే, కోర్టుకు నానావతి ఆస్పత్రి సూపరింటెండెంట్ అందజేసిన నివేదికలో ఏముందో తెలియదు. వరవర రావు మరికొద్ది రోజుల పాటు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో ఉండేందుకు అవకాశం లభించడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed