హుజూరాబాద్‌ అభ్యర్థులకు వ్యాక్సిన్ పరేషాన్

by  |
హుజూరాబాద్‌ అభ్యర్థులకు వ్యాక్సిన్ పరేషాన్
X

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థుల్లో వ్యాక్సినేషన్‌తో పరేషాన్ అవుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకుంటేనే నామినేషన్ వేసేందుకు అనుమతి ఇస్తామంటూ పోలీసు అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులు ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యారు. మంగళవారం ఇండియా ప్రజాబంధు పార్టీకి చెందిన అభ్యర్థి మంగు రాంచందర్ నామినేషన్ దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రాగా పోలీసులు అడ్డుకుని రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న పత్రాలను చూపించాలని అడిగారు. దీంతో రాంచందర్ అసహనానికి గురై పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

నిన్న నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా అప్పుడు ఇలాంటి నిబంధన ఏం చెప్పలేదని, ఈ రోజు రెండు డోసులు వ్యాక్సిన్ నిబంధన పెడుతూ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో నామినేషన్ వేసేందుకు వస్తున్న అభ్యర్థులతో పాటు బలపరిచే వారు సైతం రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలని నిబంధనలు పెట్టడం తమను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికేనని అన్నారు. ఓటర్లు సైతం రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట దర్శకుర్తి శ్రీధర్, ఆరెల్ల శ్రీనివాస్, ములుగు వంశీ, మునిగంటి మహేష్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed