చివరి నిమిషంలో CM జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. మద్దతుపై ప్రకటన

by GSrikanth |
చివరి నిమిషంలో CM జగన్‌కు షాకిచ్చిన తల్లి విజయమ్మ.. మద్దతుపై ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అనూహ్యంగా ఎన్నికల్లో తన మద్దతు ఎవరికో తేల్చి చెప్పారు. జగన్‌కు షాకిస్తూ షర్మిలకు మద్దతు ప్రకటించారు. ‘‘ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. వైఎస్సార్ బిడ్డను గెలిపించి పార్లమెంట్‌కి పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ విజయమ్మ శనివారం వీడియో విడుదల చేశారు. షర్మిల అవినాశ్ రెడ్డిపై పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు పోటీ చేస్తుండటం.. కుమారుడికి కాదని విజయమ్మ కూతురికి మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత చెల్లె, కన్న తల్లే నిన్ను నమ్మడం లేదంటూ నెట్టింట జగన్‌పై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఇవాళ ఎన్నికల ప్రచార ప్రక్రియ ముగిసింది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పార్టీ అభ్యర్థులు ప్రచారాన్ని ముగించేశారు.

Read More..

పిఠాపురంలో CM జగన్ సంచలన ప్రకటన.. వంగా గీతకు డిప్యూటీ సీఎం

Next Story

Most Viewed