సెకండ్ వేవ్ ఓవర్.. 18 ఏళ్లు నిండిన వారికి DH కీలక సూచన..

by  |
DH-Srinivasa-Rao
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినందున సాధారణ జ్వరాన్ని కూడా కరోనా అని భావించవద్దన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి పెరుగుతున్నందున జ్వరం వచ్చిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్నారు. జ్వరం, కళ్లు తిరగడం, విరోచనాలు వంటి లక్షణాలు ఉంటే ఆస్పత్రికి వెళ్ళాలని.. హైదరాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఏజెన్సీ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, మరికొన్ని చోట్ల మలేరియా కేసులు కూడా వెలుగుచూస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1200 డెంగ్యూ కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయని వివరించారు.

18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ తప్పనిసరి..

రాష్ట్రంలో 18ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. ఇక మీదట కరోనా టీకా తీసుకున్నవారినే పబ్లిక్ ప్రదేశాల్లో సంచరించే అవకాశం కల్పించే ఆలోచనను ప్రభుత్వం చేస్తున్నదని తెలంగాణ వైద్యారోగ్య డైరెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, త్వరలోనే ఇంటింటికీ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నదని తెలిపింది.



Next Story

Most Viewed