రోజుకు కోటి మందికి టీకా : ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్

by  |
AIIMS Chief Dr. Randeep Guleria
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను ఛేదించాలంటే అదేస్థాయిలో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఇందుకోసం దేశీయ టీకాలతోపాటు విదేశాల నుంచి వ్యాక్సిన్లు సేకరించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని వివరించారు. జులై చివరినాటికి కేంద్ర ప్రభుత్వం రోజుకు కోటి మందికి టీకా వేయాలని భావిస్తున్నదని చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం దేశీయంగా టీకా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచాలని అన్నారు. విదేశాల నుంచి సాధ్యమైన మేరకు టీకాలను సమీకరించాలని సూచించారు. టీకా ఉత్పత్తిదారులు వేర్వేరుగా డీల్స్ చేసుకోవడానికి ఇష్టపడరని, సింగిల్ అథారిటీతో ఒప్పందాలకు మొగ్గుచూపుతాయని అన్నారు. ఇటీవలే మొడెర్నా, ఫైజర్‌లు రాష్ట్రాలతో సప్లై డీల్ చేసుకోబోమని, కేంద్రంతోనే చేసుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed