AP News: నిద్రమత్తులో అధికారులు.. గాఢాంధకారంలో ప్రజల అవస్థలు..

by Indraja |
AP News: నిద్రమత్తులో అధికారులు.. గాఢాంధకారంలో ప్రజల అవస్థలు..
X

దిశ కొండపి: గృహాలకు అవసరమయ్యే విద్యుత్‌ను వినియోగించుకున్నా, వినియోగించుకోక పోయినా, క్రమం తప్పకుండా సకాలంలో విద్యుత్ శాఖకి విద్యుత్ చార్జీలను చెల్లిస్తున్నా విద్యుత్ వినియోగ దారులకు కష్టాలు, నష్టాలు తప్పడం లేదు. సాయి నగర్ విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్న సమస్య ఎక్కడ? ఎందుకు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ చెయ్యాలి?

హై ఓల్టేజ్ సమస్యా? లో ఓల్టేజ్ సమస్యా? ఫోర్ ప్లే సమస్యా? ట్రాన్స్ ఫారం సమస్యా? కాలం చెల్లిన కండక్టర్/ కేబుల్ సమస్యా? అనే ప్రశ్నలకు విద్యుత్ శాఖ నుండి సాయి నగర్‌ విద్యుత్ వినియోగ దారులకు సమాధానం దొరకడం లేదు. నిత్యం విద్యుత్ సమస్యతో బాధ పడడమే కాకుండా విలువైన విద్యుత్ గృహోపకారణాలు కాలిపోతుండడంతో తీవ్రంగా నష్ట పోతున్నారు. సంవత్సర కాలంగా కాలనీవాసులు తమ సమస్యల పరిష్కారం కొరకు చేయని ప్రయత్నంలేదు.

విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి, ఇంటింటికి మన ప్రభుత్వం, రచ్చ బండ, జగనన్నకు చెబుదాం, అధికారులు నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల పరిష్కారం మీ కోసంలో కూడా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకు పోవడం జరిగింది. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. సమస్య తలెత్తకుండా పరిష్కారం చేసి విద్యుత్ వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుని విలువైన విద్యుత్ గృహ ఉపకరణాలు ( ఫ్యాన్‌లు, ఫ్రిజ్, ఏసీ, కూలర్, మోటర్, విలువైన లైట్లు వంటి పలు వస్తువులు) కాలిపోయి విద్యుత్ వినియోగదారులకు నష్టాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సాయినగర్ విద్యుత్ వినియోగ దారులు అధికారులకి మొర పెట్టుకుంటున్నారు.

దశాబ్దాల క్రితం వేసిన కండక్టర్/ కేబుల్‌నే ఇప్పటికీ వాడుతున్నారు. అలానే ఈ ప్రాంతంలో వియోగం అయే విద్యుత్ వినియోగానికి సరిపడే ట్రాన్స్‌ఫారం లేక నిత్యం విద్యుత్ సరఫరాకు అంతరాయం చోటు చేసుకుంటోంది. కనీసం సాయినగర్ విద్యుత్ వినియోగ దారుల సమస్య పరిష్కారం చేసేందుకు, ఆ ప్రాంత విద్యుత్ వినియోగ దారులు నిత్యం వినియోగించుకునే విద్యుత్‌‌ని పరిగణనలోకి తీసుకుని ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.

దశాబ్దాల క్రితం వేసిన కండక్టర్/ కేబుల్ స్థానంలో మెయింటేనెన్స్ కింద గానీ నూతన పథకంలోగానీ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి లో ఓల్టేజ్, హై ఓల్టేజ్ వంటి సమస్య పరిష్కారం చెయ్యాలని కోరుకుంటున్నారు. సాయి నగర్‌లో విద్యుత్ స్థంభాలు కొన్ని చోట్ల దూరంగా ఉండటం, వొరిగి పోవడంతో కేబుల్ కిందకు వేలాడు తున్నాయి.

వాటికి ప్రత్యామ్నాయంగా మెయింటినెన్స్ కింద అవసరమైన చోట్ల ప్రత్యేక విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చెయ్యాలని అధికారులను కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ శాఖ సిబ్బంది నిత్యం సమస్య పరిష్కారం కోసం తాత్కాలిక ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా ఇస్తున్నా, లైన్‌పై ఎదురయ్యే సమస్యలకు శాశ్వత పరిష్కారం చెయ్యలేక పోతున్నారు.

సిబ్బందికి విద్యుత్ వినియోగదారుల నుండి ఎదురయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని సాయినగర్ విద్యుత్ వినియోగదారుల కోరుచున్నారు.

Next Story

Most Viewed