సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ లేఖ

by  |
సీఎం కేసీఆర్‌కు ఉత్తమ్ కుమార్ లేఖ
X

దిశ, న్యూస్ బ్యూరో: ‘‘సీఏఏ, ఎన్నార్సీ, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని మేము స్వాగతిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో ఎన్‌పీఆర్‎ను ఆపడానికి ఇది ఒక్కటే సరిపోదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వ అధికారులలో అస్పష్టతను తొలగించడానికి, ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగా స్పష్టమైన జోవో‌ను రాష్ర్ట ప్రభుత్వం తీసుకు రావాలన్నారు. కేరళలో జాతీయ జనాభా రిజిస్టర్ నవీకరణకు సంబంధించి అన్ని కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని” ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖలో తెలిపారు. ఈ సందర్భంగా లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. కేరళ మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా ఎన్‌పిఆర్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే చేయాలన్నారు. దీంతో తీర్మానం మరింత ప్రభావంతంగా ఉండటమే కాకుండా, చాలా వైవిధ్యమైన జనాభాకు నివాసంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం గట్టిగా వ్యతిరేకిస్తుందని.. బలమైన సందేశాన్ని పంపుతుందన్నారు. స్వేచ్ఛాయుతమైన, విభిన్నమైన భారతదేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తిగా.. దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా నిలబడతానని ఉత్తమ్ లేఖలో వెల్లడించారు.

tag: tpcc uttam, letter, cm kcr, caa, nrc, npr



Next Story