'దోచుకోవడం, దాచుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమి లేదు'

by  |
దోచుకోవడం, దాచుకోవడం తప్ప కేసీఆర్ చేసిందేమి లేదు
X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శనస్త్రాలు సంధించారు. ప్రజల సొమ్మును దోచుకోవడం ,దాచుకోవడం , ఎన్నికలొస్తే ఖర్చు చేయడం తప్ప ప్రభుత్వం ఏం చేయడం లేదని ఆరోపించారు. ఆదివారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ కమ్మ సంఘంలో ఏర్పాటు చేసిన నందికొండ మున్సిపాలిటీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా డబ్బులు , మద్యంతో ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచే సంస్కృతి, సంప్రదాయాన్ని సీఎం కేసీఆర్ తీసుకువచ్చారన్నారు.
నాగార్జునసాగర్ డ్యాం నీడలో ఉండి కాంగ్రెస్ ఏం చేసిందని టీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించడం సిగ్గుచేటని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ఏడు సంవత్సరాల కాలంలో పర్యాటక ప్రతిష్టను దిగజార్చిందన్నారు .నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ టూరిజం కేంద్రాన్ని అభివృద్ధి చేస్తానని, నందికొండ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ఎంపీ కోటా నుండి నిధులను కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కష్టపడి జానారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
అటు జానారెడ్డి మాట్లాడుతూ .. నాగార్జున సాగర్ లో తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ హయాంలోనేనని గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ప్రభుత్వ క్వాటర్సలలో నివాసం ఉండే రెండు వేల కుటుంబాలకు కాంగ్రెస్ హయాంలో నామినల్ ధరలకే క్వాటర్స్ ను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి షబ్బీర్ అలీ, తదితరులు పాల్గొన్నారు


Next Story

Most Viewed