నిబంధనలు పాటించనందుకు రూ. 10 లక్షల జరిమానా

by  |
నిబంధనలు పాటించనందుకు రూ. 10 లక్షల జరిమానా
X

దిశ, వెబ్‌డెస్క్: మ్యూచువల్ ఫండ్ (Mutual Fund) నిబంధనలను అనుసరించలేదని మార్కెట్స్ రెగ్యులేటరీ (Markets Regulatory), ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఎస్‌బీఐ (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda), ఎల్ఐసీ (LIC)లకు రూ. 10 లక్షల చొప్పున జరిమానా విధించింది.

ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌కు ఎల్ఐసీ, బరోడా మ్యూచువల్ ఫండ్‌కు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు స్పాన్సర్‌డ్ సంస్థలు (Sponsored companies)గా ఉన్నాయి. అయితే, ఈ ఫండ్ సంస్థల్లో అవి 10 శాతానికిపైగా వాటాలను కలిగి ఉన్నట్టు సెబీ (SEBI)గుర్తించింది.

మ్యూచువల్ ఫండ్‌ల (Mutual Funds) కోసం సెబీ (SEBI) నిబంధనల ప్రకారం.. స్పాన్సర్‌డ్ సంస్థ ఒకదానిలో 10 శాతం కంటే ఎక్కువ వాటాలను కలిగి ఉండకూడదు. యూటీఐ ఏఎంసీకి ఎస్‌బీఐ, ఎల్ఐసీ, బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్‌డ్ సంస్థలు(Sponsored companies)గా ఉంటూనే 10 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. ఇది మ్యూచువల్ ఫండ్ నిబంధనలకు విరుద్ధమని అందుకే ఒక్కో సంస్థకు రూ. 10 లక్షల జరిమానా విధించినట్టు రెగ్యులేటరీ (Regulatory) వెల్లడించింది.

Next Story