వాడిపడేసిన మాస్కులతో పరుపులు.. కాల్చి బూడిద చేసిన పోలీసులు

by  |
వాడిపడేసిన మాస్కులతో పరుపులు.. కాల్చి బూడిద చేసిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కాపాడుకోవడానికి ఫేస్ మాస్కులను ఉపయోగిస్తాం. ఏదైనా క్లాత్, ఎన్-95 మాస్కులైతే కొన్ని రోజులు వాడతాం. వాడి పడేసే (యూజ్ అండ్ త్రో) మాస్కులైతే ఒకరోజు పెట్టుకున్న తర్వాత వాటిని చెత్తబుట్టలో పడేస్తాం. కానీ, మహారాష్ట్రకు చెందిన పరుపులు (మ్యాట్రెస్) తయారుచేసే సంస్థ మాత్రం వాడి పడేసిన మాస్కులతోనే వాటిని చేస్తున్నది. దూది, ఇతర ముడి పదార్థాలతో తయారుచేయాల్సిన పరుపులను వాడిన మాస్కులతో నింపేస్తున్నది.

మహారాష్ట్రలో జలగాం జిల్లా కుసుంబ గ్రామంలో ఉన్న ఒక ప్రముఖ మ్యాట్రెస్ కంపెనీ ఈ దారుణానికి ఒడిగట్టింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ) అధికారులు సదరు సంస్థను సీజ్ చేశారు. తనిఖీల కోసం సంస్థలోకి వెళ్లిన సమయంలో అక్కడ పనిచేసే వాళ్లు పరుపులలో మాస్కులను కుక్కుతున్న దృశ్యాన్ని చూసి ఎంఐడీసీ అధికారులకు దిమ్మ తిరిగింది. దీంతో కంపెనీ నిర్వాహకుల మీద కేసు నమోదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ కంపెనీలో కుప్పలుగా పోసి ఉన్న మాస్కులను తగలబెట్టారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed