భారత్‌కు 600 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు.. యూఎస్ తెలుగు సంఘం

by  |
భారత్‌కు 600 ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు.. యూఎస్ తెలుగు సంఘం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా సెకండ్ వేవ్‌తో అతలాకుతలం అవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు యావత్ ప్రపంచం ముందుకు వస్తోంది. కరోనాపై పోరులో మాతృభూమికి తమ వంతు సహకారం అందించేందుకు ఎల్లప్పుడు సిద్దంగా ఉంటు సేవా కార్యక్రమాలు చేసే అమెరికా తెలుగు సంఘం మరోసారి అండగా నిలిచింది. అటు అమెరికాలోని భారతీయులు సైతం కరోనాపై పోరాడుతున్న మాతృదేశానికి తమకు తోచిన సాయం చేస్తున్నారు.

దీనిలో భాగంగా అక్కడి ఆటా సభ్యులు కరోనా సంక్షోభ సమయంలో భారత్‌కు సాయం చేసే విషయంలో పలు కార్యక్రమాలతో ముందుకొచ్చారు. అమెరికా తెలుగు సంఘం కొవిడ్ డిజాస్టర్ హెల్ప్ సర్వీసేస్‌ను ఏర్పాటు చేసింది. ఆటా అధ్యక్షులు భువనేష్ బుజ్జాల, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఆటా కొవిడ్ హెల్ప్ సర్వీస్ చైర్మెన్‌ అనిల్ బోద్దిరెడ్డి సహకారంతో మొదటిగా అమెరికా నుంచి ఇండియాకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు పంపించారు. సెకండ్ వేవ్‌లో కరోనా పేషెంట్లు ఆక్సిజన్ స్థాయిలు పడిపోయి తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకుని అమెరికా తెలుగు సంఘం ఆక్సిజన్ కోరత తీర్చేందుకు సుమారు 600 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు తెప్పించింది.

మెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కొవిడ్ డిజాస్టర్ హెల్ప్ సర్వీసేస్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను హైదరాబాద్ నుంచి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, బాన్స్‌వాడా, అదిలాబాద్, నారాయణపేట్‌లకు పంపిణీ చేయనున్నారు. అమెరికా తెలుగు సంఘం.. ఇండియా టీం సహకారంతో జిల్లా కేంద్రాలకు అందించేందుకు ఆటా కోఆర్డినేటర్లు కరకాల కృష్ణ రెడ్డి, లోహిత్ కుమార్, శ్రీనివాస్ బండారు, వెంకటేశ్వరరావు, నవీన్ జిల్లా కలక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా హెల్త్ సెంటర్లల్లో అందించనున్నారు.

Next Story

Most Viewed