రోహిత్‌కు మద్దతుగా కోహ్లీ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విరాట్ షాకింగ్ కామెంట్స్

by Satheesh |
రోహిత్‌కు మద్దతుగా కోహ్లీ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై విరాట్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బీసీసీఐ ఈసారి వినూత్నంగా ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీసీసీఐ చేసిన ఈ ప్రయోగంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేయగా.. మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ రూల్ తనకు ఏ మాత్రం నచ్చలేదని.. ఈ నిబంధన వల్ల ఆల్ రౌండర్లపై తీవ్ర ప్రభావం చూపెడుతోందని హిట్ మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు రియాక్ట్ అయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ.. బీసీసీఐ ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ రూల్ వల్ల ఆట సమతూకం దెబ్బ తింటుందని రన్ మెషిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇంపాక్ట్ రూల్ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయంతో తాను కూడా ఏకీభవిస్తున్నానని స్పష్టం చేశాడు. ఈ రూల్‌పై విమర్శలు ఎక్కువ అవుతోన్న నేపథ్యంలో ఈ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత దీనిపై బీసీసీఐ ఓ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటాన్నానని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్ రౌండర్స్‌పై ఎఫెక్ట్ పడటంతో పాటు.. ఆటలో జోష్ లేకుండా చేస్తుందని అన్నాడు. క్రికెట్ అంటే కేవలం ఫోర్లు, సిక్స్‌లే కాకుండా చివరి వరకు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగాలని కోహ్లీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరీ టీమిండియా టాప్ క్రికెటర్ల నుండి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌పై వ్యతిరేకత వస్తుండటంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరీ.

Next Story

Most Viewed