వలస కార్మికుల కోసం బస్సులు సిద్ధం చేసిన యూపీ

by  |
వలస కార్మికుల కోసం బస్సులు సిద్ధం చేసిన యూపీ
X

లక్నో: లాక్ డౌన్ తో వలస కార్మికులు గందరగోళంలో పడ్డారు. పని వెతుక్కుంటూ చేరిన ప్రాంతాల్లో ఉండలేక తిరిగి స్వగ్రామానికి చేరలేక తంటాలు పడుతున్నారు. లాక్ డౌన్ తో ప్రయాణ సౌకర్యాలన్ని నిలిచిపోవడంతో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటున్నారు. అటువంటి వారికోసం యూపీ ప్రభుత్వం వెయ్యి బస్సులను సిద్ధం చేసింది. ఢిల్లీ – ఉత్తర ప్రదేశ్ బోర్డర్ లోని ఘాజిపూర్ లో వలస కార్మికులు వందల సంఖ్యలో చేరారు. వీరి కోసం యూపీలోని వివిధ జిల్లాలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ వెయ్యి బస్సులు ఆ సరిహద్దుకు చేరాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం రాత్రి ఆదేశించారు. దీంతో వలస కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం ఆ బస్సుల ద్వారా వారు సొంతూరికి పయనమయ్యారు.

Tags : UP, migrant workers, buses, arranged, yogi adityanath, ghazipur

Next Story

Most Viewed