ప్రేమజంటలకు షాకిచ్చిన ఇందిరాపార్క్.. యాజమాన్యానికి ఝలకిచ్చిన ZC

by  |
ప్రేమజంటలకు షాకిచ్చిన ఇందిరాపార్క్.. యాజమాన్యానికి ఝలకిచ్చిన ZC
X

దిశ,తెలంగాణ బ్యూరో: హడావుడీ జీవితాలలో కాస్త ఉపశమనం కోసం సేద దీరేందుకు నగరవాసులు పార్క్ లకు వెళ్తుంటారు. వారితో పాటు విద్యార్థులు, వృద్ధులు సిటీలోని పార్కులకి ఖాళీ సమయంలో వస్తుంటారు. ఇక పబ్లిక్ పార్క్ అంటే ఎవరైనా రావొచ్చు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే దీనికి విరుద్దంగా పెళ్లి కాని జంటలు మా పార్కులో కి అనుమతి లేదని ఇందిరా పార్క్ యాజమాన్యం ఎంట్రన్స్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో ఇందిరా పార్క్ యాజమాన్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ లో ఓ పబ్లిక్ పార్క్ లో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఏంటని జీహెచ్ఎంసీ అధికారులకు ట్యాగ్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో స్పందించిన జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ వెంటనే తీసివేయించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పార్క్ ఆవరణలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటీవల ప్రేమ జంటలు ఎక్కువగా పార్కులకు రావడంతో కుటుంబాలతో వచ్చేవారు ఇబ్బందిపడుతున్నారని కంప్లైంట్ రావడంతో ఇందిరా పార్క్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed