యూనిలీవర్ నుంచి కరోనాను అంతం చేసే మౌత్‌వాష్!

by  |
యూనిలీవర్ నుంచి కరోనాను అంతం చేసే మౌత్‌వాష్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19ను నివారించేందుకు సరైన సామర్థ్యం కలిగిన మౌత్‌వాష్‌ను రానున్న కొద్దిరోజుల్లో ప్రవేశపెట్టనున్నట్టు దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ యూనిలీవర్ వెల్లడించింది. త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టబోయే మౌత్‌వాష్ ద్వారా కేవలం 30 సెకన్లలో 99.9 శాతం కరోనాను అంతం చేయగలదని కంపెనీ ప్రకటించింది. నోటిలో వైరస్‌ను అంతం చేయగలిగితే కరోనాను వీలైనంతవరకు నివారించగలమని, సీసీసీ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల ఇది ఖచ్చితత్వంతో పనిచేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రం చేసుకోవాల్సి రావడం, మాస్కును ధిరించాల్సి ఉండటం, సామాజిక దూరం కారణంగా త్వరలో రాబోయే మౌత్‌వాష్ తప్పనిసరి నిబంధనల జాబితాలో వచ్చే అవకాశముందని కంపెనీ పేర్కొంది. ఈ ఉప్తత్తిని భారత్‌లో తమ అనుబంధ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ నుంచి దేశీ మార్కెట్లోకి తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది. నెలరోజుల వ్యవధిలో ప్రవేశపెట్టనున్నట్టు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.


Next Story

Most Viewed