కంట్రోల్ కాని కరోనా.. పలు ప్రాంతాల్లో స్వచ్చంద లాక్ డౌన్

by  |
కంట్రోల్ కాని కరోనా.. పలు ప్రాంతాల్లో స్వచ్చంద లాక్ డౌన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితాలనివ్వడం లేదు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. సరిహద్దుల్లో ఉండే గ్రామాల ప్రజలు స్వచ్చందంగా లాక్ డౌన్ విధించుకొని వ్యాధికట్టడికి కృషి చేస్తున్నారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు పోటెత్తున్నారు. గడిచిన 24గంటల్లో 2,251 కేసులు నమోదుకాగా మొత్తం ఆక్టీవ్ కేసుల సంఖ్య 21,864కి చేరుకున్నాయి. ఒక రోజులోనే 97,442 మందికి వ్యాక్సిన్ అందించారు.

మహారాష్ట్ర ప్రభావంతో సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏ మాత్రం ఫలితాన్ని అందించడం లేదు. ట్రెసింగ్ చేయడంలో నిర్లక్ష్యం వహించడం వలనే ఈ పరిస్థితులు తలెత్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు ఆర్టీసీ బస్సులను బంద్ చేశారు. బోధన్ మండలం సరిహద్దులోని సాలూర్ చెక్ పోస్ట్‌ను, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సరిహద్దులోని పలబాద్‌పూర్ చెక్ పోస్ట్‌ను అధికారుల పూర్తిచేశారు. ఈ చెక్ పోస్ట్‌ల గుండా రాకపోకలను అనుమతించనప్పటికీ సరిహద్దులోని 13 గ్రామాలకు గుండా 7 చిన్న చిన్న చెక్ పోస్ట్ లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలు అమలు చేయకపోవడం వలన మహారాష్ట్ర నుంచి ప్రైవేటు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. ఈ పరిస్థితులతో కొన్ని గ్రామల ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకొని కట్టడి చేసుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం మాస్క్‌లు లేని 306 మందికి అధికారులు ఫైన్ లు విధించారు.

ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు

కరోనా వ్యాదిసోకిన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన చికిత్సలు, సరిపడా బెడ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు రోగులు వెళుతున్నారు.ఇదే అదునుగా ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అత్యధికంగా వ్యాదులు ప్రబలుతున్న నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన 344 బెడ్లలో 284 బెడ్లు పెషెంట్లతో నిండిపోయాయి. ఏహెచ్ బోధన్ ఆసుపత్రిలో సాధారణ రోగుల కోసం ఏర్పాటు చేసిన 39 బెడ్లులు ఫుల్ అవగా ఆక్సిజన్ కోసం ఏర్పాటు చేసిన 7 బెడ్లలో 5, ఐసీయూ కోసం ఏర్పటు చేసిన 4బెడ్లు ఫుల్ అయ్యాయి. ఆర్మూర్ సీహెచ్‌సీ ఆసుప్రతిలో సాధారణ, ఆక్సిజన్, ఐసీయూ రోగుల కోసం ఏర్పాటు చేసిన మొత్తం 80 బెడ్లు ఫుల్ అయ్యాయి. రోగులు పెరుగుతున్న జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేకపోవడంతో కరోనా రోగులకు తిప్పలు తప్పడం లేదు.

గడిచిన 24గంటల్లో 2,251 కేసులు

గడిచిన 24గంటల్లో కరోనా కేసులు నమోదు కాగా మొత్తం ఆక్టీవ్ కేసలు 21,864కి చేరుకున్నాయి. ఒక రోజులో 6మంది చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1765కి చేరుకుంది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 355, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 258, రంగారెడ్డిలో 200 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో జగిత్యాల 117, కామారెడ్డిలో 70, కరీంనగర్ లో 78, నిర్మల్ లో 154, నిజామాబాద్ లో 244, సంగారెడ్డిలో 132 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ములుగులో 7 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో 79,027 మందికి టెస్ట్ లు నిర్వహించగా 97,442 మందికి వ్యాక్సిన్ ను అందించారు. వీరిలో మొదటి డోసు టీకా 95,169 మందికి, రెండవ డోసు టీకాను 2,273 మందికి అందించారు. ఇప్పటి వరకు మొత్తం 18,56,822 మందికి మొదటి డోసు టీకాను3,02,015 అందించారు.



Next Story

Most Viewed