అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : ఎమ్మెల్యే గండ్ర

by  |
mla gandra
X

దిశ, చిట్యాల: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వ లేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం చిట్యాల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంకును ఆయన ప్రారంభించారు. అనంతరం పీఏసీఎస్ కార్యాలయం ఆవరణంలో 36 లక్షల వ్యయంతో మంజూరైన 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతులు, మహిళలకు అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నడన్నారు. రైతు బంధు పథకం కొనసాగిన విధంగానే దళిత బంధు పథకం కూడా కొనసాగుతుందని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారన్నారు. అభివృద్ధిపై సూచనప్రాయంగా విమర్శలు చేయాలే తప్ప వ్యక్తి గత విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎన్నికల హామీలలో 57 సంవత్సరాల వారికి పెన్షన్ మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అభివృద్ధిని చూసి అధికార పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు మహిళా సంఘాలు డీసీసీ బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ బ్యాంకులో అన్ని వర్గాల ప్రజలకు లోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ మర్నేని రవీందర్ రావు, నర్సింగరావు, పూర్ణచందర్ రెడ్డి, విజ్జన్ రావు, ఎంపీపీలు ధావు వినోద వీరరెడ్డి, రెడ్డి మల్లారెడ్డి, జడ్పిటీసీలు గొర్రెసాగర్, పులి తిరుపతి రెడ్డి, జోరుక సదయ్య, పీఏసీఎస్ చైర్మన్ క్రాంతికుమార్ రెడ్డి, స్థానిక ఇంచార్జీ సర్పంచ్ పూర్ణచందర్ రావు, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed