- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అఫీషియల్ : త్వరలో మరో బాహుబలి..ఫ్యాన్స్‌కు పండుగే ఇక!
దిశ, సినిమా : రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా తెలుగు చిత్ర రికార్డులు బ్రేక్ చేసిన, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. హాలీవుడ్ సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిదంటే మనమే అర్థం చేసుకోవచ్చు, దీని గురించి. ఇక ఇప్పటికీ ఈ సినిమా అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కొందరైతే రాజమౌళి మ్యాజిక్ బాహుబలి1,2 అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. త్వరలోనే బాహుబలి 3 రానున్నదంటూ, ఓ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
బాహుబలి ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ రాజమౌళి అఫీషియల్ గా ప్రకటించారు. “మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది” అంటూ ఆయన తెలిపారు. కాగా, ఇది ఓ యానిమేటెడ్ సిరీస్ లాగా రాబోతుందంట. దీంతో బహుబలి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. అయితే ఈయానిమేటేడ్ సిరీస్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తారా ? లేదా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారా .. అనే విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.