మోత్కూరులో విషాదం.. ఉరేసుకొని చేనేత కార్మికుడు ఆత్మహత్య

by  |
handloom worker suicide
X

దిశ, మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చేనేత కార్మికుడు మహేశ్వరం సోమయ్య(70) చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున తీవ్ర మనోవేదనకు గురైన సోమయ్య మున్సిపల్ కేంద్రంలోని పశువుల సంత వద్దనున్న మిషన్ భగీరథ ట్యాంక్ మెట్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళుతున్న రైతులు సోమయ్యను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ఐ యాదయ్య పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సోమయ్యకు భార్య చంద్రమ్మ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.


Next Story

Most Viewed