SBI కస్టమర్స్ కి షాకింగ్ న్యూస్..

by  |
sbi
X

దిశ,వెబ్ డెస్క్:బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు కీలక ప్రకటనలు చేసింది. డిజిటల్‌ లావాదేవీలు, బ్యాంకింగ్‌ సేవలను పొందేందుకు వెంటనే పాన్‌-ఆధార్‌ లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ సూచించింది. ఒకవేళ పాన్‌-ఆధార్‌ లింక్ చేసుకోకపొతే పాన్‌ కార్డు ఎలాంటి లావాదేవీలకు పని చేయదని, ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వెంటనే పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలని తెలిపింది. ఈ నేపథ్యంలోనే పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువును కేంద్రం 2022 మార్చి 31 వరకు పొడిగించింది.

సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌దారుల డిజిటల్‌ లావాదేవీలకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదని రూపే డెబిట్‌ కార్డు, యూపీఐ పేమెంట్‌ లావాదేవీలపై 2020 జనవరి 1 నుంచి ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు SBI తెలిపింది.జన్‌ధన్‌ ఖాతాదారుల నుంచి ఎస్‌బీఐ రూ.254 కోట్లు వసూలు చేసిందని అందులో రూ.90 కోట్లు మాత్రమే వినియోగదారులకు రిఫండ్‌ చేసినట్లు వచ్చిన వార్తలపై ఎస్‌బీఐ స్పందించింది. సీబీడీటీ ఆదేశాల మేరకు 2020 జనవరి 1 నుంచి 2020 సెప్టెంబర్‌ 14 వరకు వసూలు చేసిన మొత్తాలను రిఫండ్‌ చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి డిజిటల్‌ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.

పాన్‌-ఆధార్‌ ఇంకా లింక్ చేయని వారు (incometax.gov.in) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి


Next Story

Most Viewed