అత్తాకోడలు మృతి.. అదే భయంతో పక్కింటామె..?

by  |
అత్తాకోడలు మృతి.. అదే భయంతో పక్కింటామె..?
X

దిశ, నిజామాబాద్ రూరల్: ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు కరోనా తో మృతి చెందిన ఘటన శనివారం ఇందల్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండల కేంద్రంలోని ఎనగందుల పోచవ్వ (70) దగ్గు, దమ్ము వంటి అనారోగ్య సమస్యలతో శుక్రవారం మృతిచెందగా అంత్యక్రియలకు వచ్చిన పోచవ్వ పెద్దకోడలు లక్ష్మి (35) కి దగ్గు, జ్వరం తో బాధపడుతున్న లక్షణాలు కనిపించాయి. దీంతో కుటుంబికులు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో కరోనా పరీక్షలు ముగించుకొని జిల్లా కేద్రంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించే నిమిత్తం అంబులెన్స్ కు సమాచారం మిచ్చారు. దీంతో అంబులెన్స్ వచ్చేలోపే పోచవ్వ కోడలు లక్ష్మి మృతిచెందిదని అబులెన్స్ వైద్యులు తెలిపారు. ఓకే కుటుంబంలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెదడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో కుటుంబ సభ్యులతో పాటు బంధువులందరి కరోనా పరీక్షలు చేసి చికిత్స అందించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

దర్పల్లి మండలంలో మరొకరు…

దర్పల్లి మండల కేంద్రంలోని ఖందగిరి సుశీల(60) అనే మహిళ కరోనా సొకి౦దనే భయంతో మృతి చెందారు. వారి పక్కింటివారికి కరోనా సోకడంతో తనకు వస్తుందేమోనన్న భయంతో శుక్రవారం సుశీల పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇదిలావుండగా పరీక్షల నిమిత్తం వచ్చిన సుశీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానిలోనే వాంతులు, విరేచనాలు కావడంతో కరోనానేమో ననే భయంతో గుండెపోటు వచ్చి మృతి చెందిందని వైద్యాధికారి రఘువీర్ గౌడ్ తెలిపారు.

Next Story