ఆ మీడియా సంస్థలపై చర్యలు తీసుకోండి.. TUWJ డిమాండ్

by  |
TWJF leaders
X

దిశ, మెదక్: జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తించి, కరోనా కాటుకు బలైన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని TUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా మెదక్ హెడ్ పోస్టాఫీస్ వద్ద గాంధీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాళ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో డీజీ శ్రీనివాస్ మాట్లాడుతూ… వర్కింగ్ జర్నలిస్టులందరికీ రూ.50 లక్షల బీమా పథకం వర్తింపజేయాలని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ హెల్త్ కార్డులు చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టి, జర్నలిస్టుల ప్రాణాలకు భద్రత కల్పించాలని కోరారు. మీడియాకు సంబంధించిన కొత్త లేబర్ కోడ్ అమలులోకి వచ్చేంతవరకు వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టం అమలు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాకుండా.. జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

అనంతరం జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ.. కరోనా సాకుతో సిబ్బందిని అక్రమంగా తొలగిస్తున్న మీడియా సంస్థల యజమాన్యాలపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు మిన్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తున్న జర్నలిస్టులపై, మీడియా సంస్థలపై దాడులు చేస్తూ, తప్పుడు కేసులు బనాయిస్తోన్న ప్రభుత్వాలు ఇక విధానాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తోన్న రచయితలు, విద్యార్థులు, న్యాయవాదులు, పౌరహక్కుల కార్యకర్తలు, మేధావులపై బనాయించిన తప్పుడు దేశద్రోహం కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, వెంకటేష్ గౌడ్, శ్రీధర్, నర్సింహా చారి, సిద్దు, ప్రకాష్, రామకృష్ణ, రమేష్, లక్ష్మణ్, మురళీధర్, ఖయ్యుం‌, బాలకిషన్, మల్లేష్, శివ చరణ్ సింగ్, నగేష్, ఫసీ, లక్మణ్, శ్రీనివాస్, సుధాకర్, నరేష్, రాము, రాజశేఖర్, గోవర్దన్ రెడ్డి, గోవర్ధన్, శేఖర్ గౌడ్, శ్రీనివాస్, ప్రసాద్, శ్రీనివాస్, రాజగౌడ్, శ్రీనివాస చారి, శేఖర్, మోహన్ రాజు, శ్రీహరి గౌడ్, కుమార్ గౌడ్, రామకృష్ణ పాల్గొన్నారు.



Next Story