ఇక ట్విట్టర్ ‘ఫ్లీట్స్‌’కు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌

by  |
ఇక ట్విట్టర్ ‘ఫ్లీట్స్‌’కు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌..నెటిజన్ల సౌలభ్యం కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఇండియన్ యూజర్లకు గతేడాది ‘ఫ్లీట్స్’ ఫీచర్‌ను తీసుకొచ్చిన ట్విట్టర్, తాజాగా దానికి మరో ఫీచర్‌ను యాడ్ చేసింది. దీని ద్వారా ట్వీపుల్స్ తమ ఫ్లీట్స్‌కు నేపథ్య చిత్రాలు లేదా వీడియోలను జోడించొచ్చు. తొలిగా ఐఓఎస్‌లోఈ న్యూ ఫీచర్ విడుదల చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

ఫ్లీట్ కంపోజ్ స్క్రీన్‌ను ఓపెన్ చేసినప్పడు కనిపించే కెమెరా ఐకాన్ ద్వారా ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయొచ్చు. ఫొటో లేదా వీడియో తీయడానికి మీరు కెమెరా చిహ్నంపై నొక్కవచ్చు లేదా మీ ఫోన్‌లో సేవ్ చేసినదాన్ని జోడించొచ్చు. ట్విట్టర్ కొద్ది వారాల క్రితమే ‘ఫ్లీట్‌’లకు స్టిక్కర్స్, జిఐఎఫ్‌లు, ట్వెమోజీలను జోడించే ఫీచర్ తీసుకొచ్చింది. గత నెలలో ఫ్లీట్లకు ‘రిప్లయ్’ నిలిపివేసే ఆప్షన్ అందించింది. ఇంకా భవిష్యత్తులో ఫ్లీట్స్ కోసం మరిన్ని ఫీచర్లను ట్విట్టర్ విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఫ్లీట్స్ అనేది ట్వీట్స్‌లానే ఉంటుంది. ఇందులో యూజర్ వీడియోలు, జిఫ్‌లు ఫోటోస్‌ను షేర్ చేయొచ్చు. అయితే యూజర్‌ పోస్ట్‌ చేసిన కంటెంట్‌ 24 గంటలు మాత్రమే వాల్‌పై కనిపిస్తుంది. తర్వాత ఆ ఫ్లీట్ కనిపించదు. కాగా అప్పటికప్పుడు యూజర్లకు వచ్చిన ఆలోచనలను పంచుకునేందుకు ఈ ‘ఫ్లీట్స్‌’ ఉపయోగపడతాయి. వీటికి రీట్వీట్స్‌ కానీ లైక్స్‌ కానీ ఉండవు.



Next Story

Most Viewed