ఎట్టకేలకు తలొగ్గిన ట్విట్టర్.. గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియామకంపై క్లారిటీ

by  |
Hyderabad Cyber ​​Crime Police issued notices to Twitter
X

న్యూఢిల్లీ : త్వరలోనే భారత్‌లో తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని నియమించనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పేర్కొంది. అప్పటి దాకా ఫిర్యాదులను ఇతర అధికారులు పరిష్కరిస్తారని ఢిల్లీ హైకోర్టుకు ట్విట్టర్ తెలిపింది. ‘నూతన ఐటీ నిబంధనల ప్రకారం తాత్కాలిక రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఇది వరకే నియమించాం.

దాన్ని లాంఛన ప్రాయం చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగానే ఆ అధికారి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ అధికారి స్థానంలో మరొకరిని నియమించే విషయంలో ఫైనల్ స్టేజీలో ఉన్నాం’అని తెలిపింది. తమ సంస్థ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిజిష్టర్ అయినందున ఈ పిటిషన్‌ను కొనసాగించదగినది కాదని హైకోర్టులో ట్విట్టర్ వాదనలు వినిపించింది.

Next Story