నైజీరియాలో ట్విట్టర్‌ పై నిషేధం..

by  |
నైజీరియాలో ట్విట్టర్‌ పై నిషేధం..
X

దిశ, వెబ్‌డెస్క్ : నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా దిగ్గజ సంస్థల్లో ఒకటైన ట్విట్టర్ (Twitter) కార్యకలాపాలపై నిరవధిక నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే నైజీరియా ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురవడమే కాకుండా ప్రభుత్వ చర్య పట్ల తీవ్ర అసంతృప్తితో పాటు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ట్విట్టర్ పాలసీలో భాగంగా ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలు’ (దుర్వినియోగ ప్రవర్తన) కింద అధ్యక్షుడు బుహారీ అకౌంట్‌ను రెండ్రోజుల క్రితం ట్విట్టర్ సంస్థ 12 గంటల పాటు నిలిపివేసింది. నైజీరియాలోని ప్రభుత్వ భవనాలపై దాడులకు తెగబడుతున్న ప్రాంతీయ వేర్పాటు వాదులను కఠినంగా శిక్షిస్తామని అధ్యక్షుడు బెదిరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, తన ఖాతాను నిలిపివేయడం ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రెసిడెంట్ బుహారీ (Twitter)పై చర్యలకు ఉపక్రమించారు.

అనంతరం నైజీరియా ఫెడరల్ ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. తమ దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను ‘‘నైజీరియాకు చెందిన కార్పొరేట్ ఉనికిని అణగదొక్కేందుకు ఒక టూల్’’ లాగా ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా, ప్రభుత్వ నిర్ణయాన్ని ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ది కేబుల్ మాజీ ఎడిటర్ ఫిసాయో సోయోంబో ట్విట్టర్‌పై నిషేధాన్ని ‘‘సిగ్గుచేటు చర్య’’గా అభివర్ణించారు. మానవ హక్కుల న్యాయవాది క్లెమెంట్ న్వాంక్వో ఈ ‘‘రాజ్యాంగ విరుద్ధమైన’’ చర్యను వెంటనే తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed