కరోనా విషాదం: అమ్మా.. అన్న ఎక్కడంటూనే తమ్ముడు కూడా

by  |
కరోనా విషాదం: అమ్మా.. అన్న ఎక్కడంటూనే తమ్ముడు కూడా
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఈ వైరస్ వలన ఎంతోమంది తమ ఆత్మీయులను కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాలు తమ అండను కోల్పోతున్నాయి. కళ్ళముందే కన్నా కొడుకులు, కట్టుకున్నవారు, కనిపెంచినవారు ఈ కరోనాకు బలవుతుంటే చూడడం తప్ప ఏమి చేయలేని పరిస్థితితుల్లో ఉన్నారు ఆత్మీయులు. గతేడాది నుండి ఇప్పటివరకు ఎన్నో విషాద ఘటనలు మనసును కలిచివేస్తున్నాయి. తాజాగా ఒకేసారి కలిసిపుట్టిన అన్నదమ్ములు కరోనా వలన ఒకేసారి మృతిచెంది ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన ఘటన లక్నో లో వెలుగుచూసింది. వివరాలల్లోకి వెళితే.. గ్రెగరీ రైమండ్‌ రఫేల్‌, సోజా దంపతులకు ఏప్రిల్‌ 23, 1997 మర్చిపోలేని రోజు.. ఎంతో ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలకు సాజా జన్మనిచ్చింది. వారికి ప్రేమగా జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ, రాల్‌ఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ అని పేర్లు పెట్టుకున్నారు రేమండ్‌ దంపతులు.

కవలలుగా పుట్టిన ఆ ఇద్దరు అన్నదమ్ములకు ఒకరంటే ఒకరికి ప్రాణం.. ఏం చేసినా కలిసే చేసేవారు. ఎప్పుడు వీడిపోని బంధానికి నిలువెత్తు చిరునామాగా ఎదుగుతున్న ఆ పిల్లలను చూసి రేమండ్‌ దంపతులు మురిసిపోయేవారు. ఆటలు, పాటలతో తో చదువులోనూ ఈ కవలలు మొదటి స్థానంలో ఉండేవారు. ఇద్దరూ ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లే. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో భాగంగా జోఫ్రెడ్‌ అసెంచర్‌లో ఉద్యోగం సంపాదిస్తే.. రాల్‌ఫ్రెడ్‌ హుందాయ్‌ మ్యుబిస్‌ కంపెనీ(హైదరాబాద్‌ కార్యాలయం)లో ఉద్యోగం వచ్చింది. అందానికి అందం.. కష్టపడే తత్త్వం అన్నిటికి మించి కుటుంబమంటే గౌరవం.. అన్నదమ్ములంటే ప్రేమ.. వీటన్నింటితో ఆ ఇంట్లో ఎప్పుడు ఆనందాలే వెల్లివిరిసాయి. అయితే ఈ ఆనందాన్ని చూసి దేవుడికి కూడా కన్నుకుట్టిందేమో.. కరోనా మహమ్మారి ఆ ఇంట్లోకి ప్రవేశించింది.

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంటిదగ్గర పనిచేద్దామనుకొని వచ్చిన ఇద్దరు కవలలకు కరోనా సోకింది. చికిత్స తీసుకొంటే తగ్గిపోతుందని తల్లిదండ్రులకు వారే ధైర్యం చెప్పి హాస్పిటల్ కి పయనమయ్యారు. అంతా బాగైపోతుంది అనుకున్న సమయంలో జోఫ్రెడ్‌ వాగెసే గ్రెగరీ శ్వాస అందాకా కన్నుమూశాడు. ఇక అన్న మృతి విషయం తమ్ముడికి తెలిస్తే తట్టుకోలేడని ఆ విషయాన్ని తల్లిదండ్రులు అతని దగ్గర దాచారు. కానీ కలిసి పుట్టినవారు. వారి మనసులు ఎప్పటికి ఒకేలా ఉంటాయి. అన్న కనిపించకపోయేసరికి రాల్‌ఫ్రెడ్‌ ‘‘అమ్మా.. నువ్వేదో దాస్తున్నాం. ఏదో జరిగింది. నాకు చెప్పడం లేదు కదా. చెప్పమ్మా ప్లీజ్‌’’ అని వాళ్ల అమ్మను అడిగాడు. ఈ విషయం తెలిసి 24 గంటలు గడవకముందే తను కూడా తనకెంతో ఇష్టమైన కవల సోదరుడి దగ్గరకు వెళ్లిపోయాడు. ఎదిగిన ఇద్దరు బిడ్డలను రోజు వ్యవధిలోనే పోగొట్టుకున్న మేమెంత దురదృష్టవంతులమో అని ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ప్రతి ఒక్కరి మనసును తడిమేస్తున్నాయి.

Next Story

Most Viewed