ఈ రాశి స్త్రీలకు భర్తల నుంచి ఆశ్చర్యకరమైన గిఫ్ట్స్

258
Panchangam

తేది : 20, జూలై 2021
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(నిన్న రాత్రి 9 గం॥ 59 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : అనూరాధ
(నిన్న రాత్రి 10 గం॥ 26 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 8 గం॥ 31 ని॥ వరకు)
యోగము : శుక్లము
కరణం : వణిజ
వర్జ్యం : (ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 6 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 34 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 10 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 24 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 19 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 10 గం॥ 14 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 6 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 37 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 గంటలకు)

మేష రాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే జాగ్రత్త, సహనం అవసరం. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. శరీరం బరువును పెంచే హై క్యాలోరిస్ భోజనాన్ని మానేయండి. సరైన ప్రణాళికతో ఆఫీస్ పనులను పూర్తి చేయండి. తొందరపాటు వలన తప్పులు జరగవచ్చు జాగ్రత్త. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు. కోపం అసహనం వలన మీకు ఒరిగేదేమీ లేదు. కానీ దాని వలన జనాలు మీకు దూరం అవుతారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వారితో వాదోపవాదాలకు దిగకండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల మధ్యలో కి మూడో వ్యక్తిని రానీయకండి.

వృషభ రాశి: పట్టుదల ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సాధిస్తారు. విజయం సాధించాలంటే మరింత కష్టపడాలి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. లేకుంటే ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. బంగారు భవిష్యత్తు కోసం డబ్బును ఆదా చేయండి వృధాగా ఖర్చు పెట్టకండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి వారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫీసు పనుల పట్ల మీ నిబద్ధతకు అందరి ప్రశంసలు. కొంతమందికి ఆఫీసు టూర్స్. కావలసిన ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు. ఫిట్నెస్ కొరకు చేసిన ప్రయత్నాలు సఫలం. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిధున రాశి: ఇతరులతో మీ కమ్యూనికేషన్ మీకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. దైవ ప్రార్ధన వలన మానసిక ప్రశాంతత మరియు పాజిటివ్ ఆలోచనలు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా మెరుగుపడతాయి. స్నేహితుల బంధువుల నుంచి బహుమానాలు అందుకుంటారు. ఆఫీసు పనుల పట్ల మీ నిబద్ధతకు పై అధికారుల ప్రశంసలు. మీ పిల్లల చదువులను గమనించండి వారు టీవీ మొబైల్ మీద సమయం వృధా చేస్తున్నారు. కావలసినంత ధనం చేతికందుతుంది. కొంత దానధర్మాలు చేస్తారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కర్కాటక రాశి: సహనం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఆధ్యాత్మిక మార్గం వైపు ఆసక్తి కనబరుస్తారు. దైవప్రార్థన వలన మానసిక ప్రశాంతత మరియు ఎంతో బలం. సీజన్ మార్పు వలన దగ్గు జలుబు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. సొంత వైద్యం చేసుకోకండి. ఆఫీసులో ఎంత కష్టపడి పని చేసినా కావలసినంత గుర్తింపు రాలేదని మనోవేదన. కావలసినంత ధనం చేతికందుతుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజున గడపండి.

కన్య రాశి: ఈరోజు హ్యాపీ డే. అనుకున్న కార్యాలను ఆడుతూ పాడుతూ సాధిస్తారు. దైవప్రార్థన వలన మానసిక బలం. స్నేహితుల బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి. దానివల్ల ఎంతో మనో ధైర్యం. కుటుంబంలో చిన్న చిన్న గొడవల వలన ఇబ్బందికరం. వారితో మనసు విప్పి మాట్లాడండి. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్థులకు తమ ఆత్మీయుల సలహాల వలన లాభాలు. దానివలన వ్యాపార విస్తరణకు అవకాశాలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తల సామరస్య ధోరణి వలన మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

సింహరాశి: అనుకున్న కార్యాలను సాధించాలంటే మరింత కష్టపడాలి. దైవకార్యాల కోసం ఖర్చు పెడతారు దాని వలన మానసిక ప్రశాంతత. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి దానివలన అపార్ధాలు తొలగిపోతాయి. ఆఫీసులో కష్టపడి పని చేస్తారు పెండింగ్ వర్క్ లను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు లాభాల కొరకు నూతన ప్రణాళికలను అమలు చేయవచ్చు. ఆదాయం పర్వాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి. బయట తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీతో తగినంత సమయం గడపడం లేదని మానసిక అశాంతి.

ధనుస్సు రాశి: సమస్యల పట్ల మీ శీఘ్ర నిర్ణయాలు మీకు గుర్తింపును తెస్తాయి. అదనపు బాధ్యతల వలన ఈరోజు ఆఫీసులో ఫుల్ బిజీగా ఉంటారు. కొంతమందికి ఆఫీసు టూర్స్. వ్యాపారస్తులు పెద్ద మొత్తాలలో అప్పులు ఇవ్వకండి. అవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ. భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. దాని వలన ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం. మీ తండ్రిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.

వృశ్చిక రాశి: నిజాయితీగా కష్టపడితే అనుకున్న కార్యాలను సాధిస్తారు. అతి జాగ్రత్త అనర్ధదాయకం. ప్రతి విషయము సమస్య అవుతుందని భయపడితే మానసిక శారీరక అనారోగ్యం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రముఖులతో పరిచయాలు. తోటి ఉద్యోగుల సహాయం తీసుకోండి. కష్టపడి పనిచేసినా గుర్తింపు రాకపోవచ్చు అధైర్య పడకండి. ఆదాయం పరవాలేదు అనవసరపు ఖర్చులు పెట్టకండి. బయటి తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితాన్ని ఆనందించండి.

తులారాశి: ఆశావాహ దృక్పథం మరియు సర్దుబాటు ధోరణి వలన అనుకున్న కార్యాలను సాధిస్తారు. అవసరాలకు తగినంత ఆదాయం లేకపోవటం వలన మానసిక అశాంతి. ప్రేమికులకు ప్రేమ విఫలం అయ్యే అవకాశం. మీ తోటి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. పొరపాటు మాటల వలన గొడవలు జరిగే అవకాశం. వ్యాపార విస్తరణ కొరకు చేస్తున్న ప్రయాణాలు దీర్ఘకాలంలో లాభాలను తెస్తాయి. అధిక శ్రమ వలన భుజాల నొప్పులు వెన్నునొప్పి ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ సమస్యలు మీ భార్యాభర్తలను బాధిస్తాయి.

మకర రాశి: సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. మిమ్మల్ని మీరు శభాష్ అనుకోండి. నూతన అవకాశాలు కనబడతాయి. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. వ్యాపారస్తులు లాభాల కొరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వేచి చూడండి. ఆఫీసులో పనులను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి మీ పై అధికారులు మిమ్మల్ని గమనిస్తున్నారు. సహోదరుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఆశ్చర్యకరమైన గిఫ్టు ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కుంభరాశి: అందరి బాధ్యతలను నెత్తిమీద వేసుకోకండి. దాని వలన అధిక శ్రమ. పనులు పూర్తి కాక పోవడం వలన మానసిక అశాంతి. ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. భాగస్వామ్య వ్యాపారులకు మంచి లాభాలు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం. పెద్ద వారి దీవెనలు లభిస్తాయి. తల్లి గారి నుంచి ధనసహాయం. సరైన పథకాలలో పెట్టుబడి వలన అధిక లాభాలు. ఆదాయం పరవాలేదు. అనవసరపు ఖర్చులను నివారించండి పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మీన రాశి: ఆశావహ దృక్పథం పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఇతరులతో వాదోపవాదాలకు దిగకండి. ఈరోజు డబ్బును అవసరాలకు ప్రాముఖ్యతనిచ్చి ఖర్చు పెట్టండి. సహోదరుల సహాయం లభిస్తుంది. మీ తోటి ఉద్యోగులు మీరు పరస్పర సహాయం చేసుకోవటం వలన ఆఫీసులో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. అధిక శ్రమ వల్ల మోకాళ్ల నొప్పులు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.