అంతరాలను పెంచేవిధంగా కొత్త విద్యా విధానం

by  |
అంతరాలను పెంచేవిధంగా కొత్త విద్యా విధానం
X

దిశ, న్యూస్​బ్యూరో: కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న జాతీయ విద్యా విధానం ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించి, ప్రజల మధ్య అంతరాలను మరింత పెంచేదిగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్​యూటీఎఫ్) విమర్శించింది. విద్యారంగ భాగస్వాముల నుంచి సూచనలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం ఏ సూచనలనూ పరిగణనలోకి తీసుకోలేదని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో యూటీఎఫ్​ అభిప్రాయపడింది. సుమారు రెండున్నర లక్షల సూచనలు వచ్చాయని, వాటిని పరిగణనలోకి తీసుకున్నారు.వేటిని తిరస్కరించారో వెల్లడించలేదని యూటీఎఫ్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి పేర్కొన్నారు.

దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, 3,5,8 తరగతులలో పరీక్షలు నిర్వహించటం పరోక్షంగా డిటెన్షన్ విధానాన్ని అమలు జరపటమేనని వారు తెలిపారు. విద్యార్థి నిష్పత్తి పాఠశాల మొత్తానికి కాకుండా తరగతి వారీగా ఉండాలని వారు సూచించారు. ఉన్నత విద్యలో విదేశీ విశ్వ విద్యాలయాలు, ప్రైవేటు కళాశాలలకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం కల్పించే దిశగా ఎన్ఈపీ ఉందని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed