పబ్‌లపై పోలీసుల నిఘా..

by  |
పబ్‌లపై పోలీసుల నిఘా..
X

హైదరాబాద్‌లోని పబ్‌లపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక పబ్‌లు ఉన్నవాటిలో హైదరాబాద్‌ రెండోస్థానంలో ఉండగా, ప్రస్తుతం సిటీలో 171పబ్‌లు ఉన్నట్టు పోలీసులు ధృవీకరించారు. అయితే నిర్దేశించిన సమయానికి మించి పబ్‌లు నడపటం, డ్రగ్స్ కల్చర్ కూడా పెరిగిపోవడంతో వివాదాలకు తావిస్తో్ంది. తాగిన మత్తులో యువతులను వేధించడం, రోడ్డుపై న్యూనెస్స్ పెరుగుతుండటంతో రోజువారీ కేసులు నమోదవుతున్నట్టు సమాచారం. అర్ధరాత్రి దాటాక డీజే సౌండ్స్ పెట్టడం వలన రాత్రుళ్లు డిస్టపెన్స్ ఎక్కువవుతోందని పలువురు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిటీలోని ముఖ్యమైన లిస్బన్, రిపీట్, కర్మ, ఫర్టీ, ఫ్యాట్ ఫిజియన్, టెకిషాకి, అమినేషియా, ప్రిజమ్ పబ్‌లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.మైనర్లను పబ్బుల్లోకి అనుమతివ్వరాదని నిబంధన ఉన్నవాటిని కొన్నిపబ్బులు బేఖాతరు చేస్తున్నారు. ఫలితంగా మైనర్లు ఫుల్‌గా తాగి తూలుతూ నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. అంతేకాకుండా ఓవర్ స్పీడ్‌తో వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారు. వీటివలన సిటీ కల్చర్ ఎంతగా చెడిపోయిందంటే తాగిన మత్తులో ఇతరుల మీద దాడికి పాల్పడేంతగా..రెండ్రోజుల కిందట సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై ప్రిజమ్ పబ్‌లో ఎమ్మెల్యే తమ్ముడు, అతని మిత్రులు దాడికి తెగబడ్డారు. వారి మీద బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు కాగా ప్రస్తుతం వారంతా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. సిటీకల్చర్ దెబ్బతినేలా పబ్ నిర్వహకులు వ్యవహరిస్తున్నారని పలు ఫిర్యాదులు అందడంతో అప్రమత్తమైన పోలీసులు వారిపై చర్యలకు ఉప‌ క్రమిస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Tags: hyd pubs, culture, damage city nature, focused by ts police, rules violation

Next Story

Most Viewed