నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్

by  |
నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్
X

దిశ, న్యూస్ బ్యూరో: కొవిడ్-19 సంక్షోభ సమయంలో 50 వేల మంది నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సెరా సంస్థతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్, ఏఐ, కంప్యూటర్ సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి అధిక-డిమాండ్ కలిగిన కోర్సులను, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. సాంకేతిక నేపథ్యం లేని వ్యక్తులకు శిక్షణ ఇవ్వడానికి రూపొందించిన గూగుల్ ఐటీ సపోర్ట్ప్రొఫెషనల్ సర్టిఫికేట్ వంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్లను సాధించే అవకాశం లభించనుంది. 3,800 రకాల కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. “ప్రస్తుత మహమ్మారి వల్ల అభివృద్ధి మందగమనాన్ని ఒక అవకాశంగా చూడాలని, విద్యార్థులు, ఉద్యోగాలు కోరుకునే గ్రాడ్యుయేట్లు, ఉద్యోగాల మధ్య ఉన్న నిపుణులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షోభం వల్ల ప్రభావితమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తమను తాము నైపుణ్యం చేసుకోవడానికి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలు, సంస్థల ఫ్యాకల్టీ బోధించే సరికొత్త డిజిటల్ నైపుణ్యాలపై యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రపంచంలోని ప్రముఖ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేయడం పట్ల సంతోషంగా ఉందన్నారు. కోర్సెరా సీఈఓ జెప్ మాగ్గియోన్కల్డా మాట్లాడుతూ.. భవిష్యత్తులో శ్రామికశక్తిని సృష్టించే నిబద్దతకు పేరుగాంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడానికి 2017 లో ఆన్ లైన్ కోర్సులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబరు 30వ తేదీలోపు పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.



Next Story

Most Viewed