భూముల రిజిస్ట్రేషన్‌పై TS కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం

by  |
TS-LANDS
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదన చేసింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగిందని వెల్లడించింది. ప్రస్తుతం భూముల రిజిస్ట్రేషనల్ విలువ ఆంధ్రప్రదేశ్‌లో 11 శాతం, తమిళనాడులో 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతంగా ఉన్నట్లు తెలిపింది. గత ఎనిమిది సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదని తెలంగాణ కేబినెట్ స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనున్నది.



Next Story

Most Viewed