అమ్మకానికి సిద్ధంగా ట్రూ కాలర్ డేటా?

by  |
అమ్మకానికి సిద్ధంగా ట్రూ కాలర్ డేటా?
X

స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ ట్రూ కాలర్ యాప్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినపుడు ఆ నెంబర్ ఎవరిదో ట్రూ కాలర్ పసిగట్టేస్తుంది. కాల్ రావడానికి ఒక సెకను ముందే చేస్తున్నదెవరో చెబుతుంది. అయితే సైబల్ అనే ఆన్‌లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ట్రూ కాలర్ గురించి ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది.

యాప్ ద్వారా సేకరించిన 4.75 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత ట్రూ కాలర్ డేటా ప్రస్తుతం డార్క్ వెబ్‌లో రూ. 75,000లకు అమ్మకానికి అందుబాటులో ఉందనేది ఈ నివేదిక సారాంశం. 2019 నాటి డేటా ఇంత తక్కువ ధరకు అందుబాటులో ఉండటం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని సైబల్ సంస్థ అంటోంది. ఈ డేటాలో మొబైల్ నెంబర్, లింగం, నగరం, నెట్‌వర్క్, ఫేస్‌బుక్ ఐడీ వంటి వ్యక్తిగత డేటా చక్కగా అమర్చిఉందని చెబుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, డేటా సురక్షితంగానే ఉందని ట్రూకాలర్ కంపెనీ ఒక ఈమెయిల్ స్టేట్‌మెంట్ ద్వారా తెలిపింది. ఇలాంటి డేటా గురించే గతేడాది మే నెలలో కూడా ఫిర్యాదులు వచ్చాయని కంపెనీ పేర్కొంది. వేరే యాప్ నుంచి తీసుకున్న డేటాను కూడా ట్రూకాలర్ పేరు చెప్పి విశ్వసనీయత పోగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది.



Next Story

Most Viewed