100 పోలీస్‌స్టేషన్లకు శానిటైజర్ స్టాండ్స్ పంపిణీ

by  |
100 పోలీస్‌స్టేషన్లకు శానిటైజర్ స్టాండ్స్ పంపిణీ
X

దిశ, క్రైమ్‌బ్యూరో: టీఆర్ఎస్ సోషల్ మీడియా ఆర్గనైజర్ సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని 100 పోలీస్‌స్టేషన్లకు హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ల స్టాండ్‌లను మంగళవారం అందజేశారు. కరోనా మహమ్మారి నియంత్రణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ సేవలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కరోనా వైరస్ నుంచి జాగ్రత్తలు పాటించే ప్రక్రియలో పోలీసు సిబ్బంది నిత్యం చేతులను శానిటైజ్ చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అందుకు తన వంతు బాధ్యతగా నగరంలోని 100 పోలీస్ స్టేషన్లలో హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ స్టాండ్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎల్బీ‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో హ్యాండ్ ఫ్రీ శానిటైజర్ స్టాండ్‌తో పాటు 10లీటర్ల శానిటైజర్‌ను సీఐ అశోక్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు విజయ్ మోహన్‌రావు, కౌశిక్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed