వరద సాయం మీకే ఇస్తాం..ఓటేయండి

by Anukaran |
వరద సాయం మీకే ఇస్తాం..ఓటేయండి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా పలు పార్టీల నాయకులు ఓటర్లకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు పోలింగ్‌కు ముందు ఇచ్చిన హామీలు వింటే ఆశ్చర్యం కలుగక మానదు. ప్రభుత్వం వరద ముంపు సహాయాన్ని ఇలా కూడా వాడుకుంటారా ? అన్పించే సంఘటన ఇది.

ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని కొత్తపేటకు చెందిన ఓ మాజీ కార్పొరేటర్ ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థితో కలిసి సుమారు వంద ఓట్లు ఉన్న ఓ అపార్ట్ మెంట్ వద్దకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. అక్కడఅపార్ట్‌మెంట్ పాలక వర్గంతో సమావేశమయ్యారు. ఓటు వేయాలని అభ్యర్థించారు. దీంతో అపార్ట్ మెంట్ పాలక వర్గం తమ సొసైటీకి మీరు ఏం చేస్తారని ప్రశ్నించారు.

దీనికి స్పందించిన వారు ముందుగా మీరు ఓట్లు వేయండి, వరద ముంపు సహాయం తిరిగి మొదలు కాగానే మీ అపార్ట్ మెంట్ లోని సుమారు 20 ఖాతాలకు రూ 10 వేల చొప్పున పడేలా చూస్తాం, వాటిని మీ అపార్ట్ మెంట్ అభివృద్ధికి వినియోగించుకోండి అనడం అక్కడున్న వారందరినీ విస్తుపోయేలా చేసింది. చేతిలో నుండి చిల్లి గవ్వ కూడా ఖర్చు లేకుండా ప్రభుత్వం అందించే ముంపు సహాయాన్ని కూడా ఇలా వాడుకుంటారా ? అని వారంతా ముక్కున వేలేసుకున్నారు.Next Story

Most Viewed