డబ్బులు తీసుకుని కారెక్కమంటే.. పంక్చర్ చేశారేందీ?

by  |
kcr-puncture1
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఒక్కటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం చర్చ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి ఎదురుతిరిగిన ఎమ్మెల్యే ఇప్పుడు మళ్లీ గెలుస్తాడా గెలవగలుగుతాడా అని అందురూ అనుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ చేతిలో ఉంది కదా.. అన్నివిధాలా వాడుకుని మళ్లీ అక్కడ కూడా ముఖ్యమంత్రి తన అభ్యర్థిని గెలిపించుకుంటాడు అనుకున్నారు. ఆ విధంగానే హుజురాబాద్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేశారు. కానీ, చివరికి ఈటల రాజేందర్ ముందు ఓడకతప్పలేదు. హుజురాబాద్ ప్రజలు ఈ ఉప ఎన్నికలో ఊహించని విధంగా భారీ మెజార్టీని ఈటలకు అందించారు. అటు కేసీఆర్ కు కూడా ఊహించని విధంగానే షాకిచ్చారు. కేసీఆర్ ఎన్ని తాయిలాలు ఇచ్చినా వాటిని తీసుకున్నారు. కానీ, ఓటు మాత్రం ఈటల రాజేందర్ కు వేశారు.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు స్పందిస్తూ కేసీఆర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ వ్యాఖ్యలు చేశాయి. అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ రిజల్ట్ ను చూసి షాకవుతున్నారంట. ఇదేందీ కేసీఆర్ ఇన్ని రూ. కోట్లు ఖర్చు చేసినా ఓటు మాత్రం బీజేపీకి వేశారేందీ అంటూ చర్చించుకుంటున్నట్లు సమాచారం. దీనిపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందంట. హుజురాబాద్ ఉప ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంతమంది నాయకులం అన్ని రోజులు కష్టపడినా కేవలం ఒక్క నాయకుడిని ఓడించలేకపోయాం అంటూ తీవ్రంగా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రజలకు కూడా డబ్బులు పంచే సమయంలో మీకే ఓట్లు వేస్తాం అని చెప్పి ప్రత్యర్థికి ఓటు వేశారేంది అంటూ చర్చించుకుంటున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed