శంభులింగేశ్వర ఆలయం దగ్గర ఉద్రిక్తత

37

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శంభు లింగేశ్వర ఆలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుంది. మై హోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో స్థానిక టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దిగారు. మీరంటే మీరే అమ్ముడు పోయారంటూ సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిజాయితీని నిరూపించుకునేందుకు శివాలయం దగ్గర ప్రమాణం చేసేందుకు బీజేపీ నేతలు చేరుకున్నారు. దీంతో శివాలయం పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. బీజేపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తోపులాటకు దారితీసింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.