బస్సుల్లేక విద్యార్థుల అవస్థలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణం

by  |
బస్సుల్లేక విద్యార్థుల అవస్థలు.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణం
X

దిశ, అల్లాదుర్గ్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని గ్రామాల విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే బస్సులు లేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మండలంలోని అల్లాదుర్గం, చిల్వర్, బోడ్మాట్ పల్లి, ముస్లాపూర్, గడిపెద్దపూర్ గ్రామాల నుండి జోగిపేట పట్టణంలోని కళాశాలకు సుమారు 200 మంది విద్యార్థులు ప్రతీరోజు వెళ్తుంటారు.

అయితే ఈ మార్గంలో ఆర్టీసీ అధికారులు కేవలం ఒకే ఒక్క ఆర్డినరీ బస్సు నడపడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదకరంగా ఫుట్‌బోర్డ్‌పై నిలబడి ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధింత అధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడపాలని స్టూడెంట్స్ కోరుతున్నారు.

Next Story