ఆసియా కప్ ఫైనల్‌లో సిరాజ్ జోరు.. ఢిల్లీ పోలీసుల పోస్ట్ వైరల్

by Shiva Kumar |
ఆసియా కప్ ఫైనల్‌లో సిరాజ్ జోరు.. ఢిల్లీ పోలీసుల పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై భారత్ పేసర్ మహ్మద్ సిరాజ్ అసాధారణమైన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. దేశం ప్రజల నుంచి అతడు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు తమ 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో 'ఈ రోజు సిరాజ్‌కు స్పీడ్ చలాన్లు ఉండవు' అంటూ వారు హాస్యాస్పదంగా ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్ట్ కు స్పందించి నెటిజన్లు.. 'మన ఢిల్లీ పోలీస్ అడ్మిన్ సూపర్' అంటూ కామెంట్ చేశారు. మరికొందరు 'మాయా భాయ్.. స్పీడ్, స్వింగ్' అంటూ ప్రశంసలు కురిపించారు.

Next Story

Most Viewed