లైవ్‌లో మహిళా రిపోర్టర్‌ని అసభ్యంగా తాకి.. అంతటితో ఆగకుండా.. (వీడియో)

by Rajesh |
లైవ్‌లో మహిళా రిపోర్టర్‌ని అసభ్యంగా తాకి.. అంతటితో ఆగకుండా.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: లైవ్‌లో ఓ మహిళా రిపోర్టర్ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన స్పెయిన్ లో చోటు చేసుకోగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. స్పెయిన్ మాడ్రిడ్ లో ఓ దుకాణంలో ఇటీవల దొంగతనం జరిగింది. ఈ ఘటనను రిపోర్టింగ్ చేసేందుకు స్థానిక క్యూట్రో ఛానల్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ వెళ్లింది. లైవ్‌లో టీవీ ఛానల్‌కు ఆమె రిపోర్టింగ్ చేస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వస్తూనే వెనక భాగంలో ఆసభ్యంగా తాకాడు.

ఇది చూసిన స్టూడియోలో ఉన్న యాంకర్ ఆ వ్యక్తి నిన్ను అసభ్యంగా తాకాడా అని ప్రశ్నించాడు. ఆ వ్యక్తిని చూయించాలని కోరాడు. కెమెరాని ఆ వ్యక్తి వైపు తిప్పగా ఇడియట్ అని తిట్టాడు. సదరు మహిళా రిపోర్టర్ సైతం లైవ్ రిపోర్టింగ్ చేస్తుండగా ఇలా అసభ్యంగా తాకడం సరైనదేనా? నీకు బుద్ధుందా అని ప్రశ్నించింది. అందుకు తాను ఏ తప్పు చేయలేదని ఆ వ్యక్తి బుకాయించాడు. సదరు వ్యక్తి అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లటప్పుడు మహిళ జుట్టు నిమిరాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


Next Story

Most Viewed