ఏకంగా రైలు బోగిలోనే దుకాణం పెట్టేసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్

by Anjali |
ఏకంగా రైలు బోగిలోనే దుకాణం పెట్టేసిన ఫ్యామిలీ.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఎవరైనా సరే టూర్‌కు, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ.. కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే దగ్గర కూర్చుని భోజనం చేస్తారు. అయితే కొన్నిసార్లు కొంతమంది చుట్టుపక్కల వారితో మాకేంటీ సంబంధం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే రైలు బోగిలో చోటుచేసుకుంది.

ఓ ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడ ప్లేస్ లేనట్లుగా ఏకంగా రైలు బోగిలోనే దుకాణం పెట్టేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయితే కొంతమందికి బయట ఫుడ్ తినడం నచ్చక ఇంట్లోనే తయారు చేసుకుని వెళ్తారు. ఖాళీ ప్రదేశాల్లో కూర్చుని తింటారు. కానీ ఓ ఫ్యామిలీ మాత్రం రైల్లో సామూహిక భోజనాల కార్యక్రమం పెట్టారు. ఒకే ఫ్యామిలీకి చెందిన చాలా మంది సభ్యులు ఒకే రైలు ఎక్కారు.

వారితో పాటు తెచ్చుకున్న.. అరటిపండ్లు, శాండ్ విచ్ లు, జామపండ్లు, కూల్ డ్రింక్స్, చిప్స్ తదితరాలను ఒకరికొకరు పంచుకుంటూ హ్యాపీగా లాగేస్తున్నారు. అంతేకాకుండా ఈ తినుబండారాలను పెట్టుకోవడానికి ఓ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీరి విధానాన్ని చూసిన తోటి ప్రయాణికులంతా షాక్ అయ్యారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇది రైలులా లేదు.. హోటల్ లా ఉంది అని కొంతమంది కామెంట్లు పెట్టగా.. మరికొంతమంది బోగిని అపరిశుభ్రం చేస్తున్నారు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా వ్యవహరించాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Next Story

Most Viewed