పాఠశాలలో దెయ్యం.. ఏకంగా క్లాస్ రూమ్ లోనే నిద్రించిన టీచర్ పై ప్రశంసల వర్షం

by Mahesh |
పాఠశాలలో దెయ్యం.. ఏకంగా క్లాస్ రూమ్ లోనే నిద్రించిన టీచర్ పై ప్రశంసల వర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ఓ ప్రభుత్వ పాఠశాలలో మంచం వేసుకుని రాత్రిల్లు మొత్తం ఓ టీచర్ ఒంటరిగా నిద్రపోయాడు. అతనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రసంశల వర్షం కురుస్తుంది. ఎందుకంటే... ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఉన్న భారీ వృక్షం హటాత్తుగా కూలిపోయింది. దీంతో పాఠశాలలో దెయ్యం ఉందని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని విద్యార్థులు మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు పాఠశాలకు రావడం మానేశారు. ఈ క్రమంలో విద్యార్థుల భయం పోగొట్టేందుకు ఆ స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలోనే ఒంటరిగా నిద్రించారు. ఉదయం విద్యార్థులు స్కూల్ కి వెళ్లి తలపులు తీయగా తమ టీచర్ రవీందర్ క్షేమంగా ఉండటంతో దెయ్యం లేదని ఊపిరి పీల్చుకున్నారు. విద్యార్థుల బయం పోగొట్టేందుకు టీచర్ తీసుకున్న నిర్ణయంతో ఆయనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.Next Story

Most Viewed