నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న హిజ్రాల ఆగడాలు..

by Disha Web Desk 12 |
నగరంలో రోజు రోజుకు పెరిగిపోతున్న హిజ్రాల ఆగడాలు..
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు హిజ్రాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శుభకార్యాలను మొదలు కొని ఏ కార్యం జరిగిన పదుల సంఖ్యలో గుంపుగా ఏర్పడి శుభకార్యాలు జరుగుతున్న చోటుకు వస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వికృత చేష్టలతో అక్కడి ప్రజలను కుటుంభ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో బంధువుల ముందు పరువు పోతుందనే భయంతో వారు అడిగినంత చెల్లించుకోక తప్పడం లేదు. ఇటీవల కాలంలో వీరి ఆగడాలు అధికం అయ్యాయి.

అయితే దీనిపై హిజ్రాల సంఘం వారు స్పందిస్తూ.. తాము అలా చేయడం లేదని.. నకిలీ హిజ్రా బ్యాచ్‌లు ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నాయని చాలా సార్లు చెప్పుకొచ్చారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటికి.. హిజ్రాలు వచ్చి నానా హంగామా సృష్టించారు. 25 వేల రూపాయలు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. బంధువుల ముందు కుటుంబ సభ్యులతో అసభ్యంగా మాట్లాడారు. ఈ తతంగం మొత్తం అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇలాంటి చర్యలకు ఎవరైన పాల్పడితే.. వెంటనే 100 కి కాల్ చేయాలని పోలీసులు సూచించారు.



Next Story

Most Viewed