హిజ్రాల అంత్యక్రియలు రాత్రిపూట చేస్తారట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

by Disha Web Desk 7 |
హిజ్రాల అంత్యక్రియలు రాత్రిపూట చేస్తారట.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
X

దిశ, వెబ్‌డెస్క్: మన సమాజంలో స్వలింగ సంపర్కులకు థర్డ్ జెండర్ హోదా కల్పించారు. వారి జీవన శైలి, పని చేసే విధానం మొదలైనవి మనకు భిన్నంగా ఉంటాయి. ఈ వ్యక్తులు వేరే ప్రపంచంలో జీవిస్తుంటారు. అయితే స్వలింగ సంపర్కులకు జీవన శైలిలో అందరితో పాటు వారికి కూడా హక్కులు ఉన్నాయి. ఇంకా కొంత మంది అయితే నపుంసకుల ప్రార్ధనలకు ఎంతో శక్తి ఉంటుందని, వారి దీవిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతుంటారు. ఈ కారణంతోనే శుభకార్యాలు జరిగినప్పుడు కొంత మంది నపుంసకులను పిలిపించి దీవెనలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే.. స్వలింగ సంపర్కులను చనిపోతే వారికి రాత్రి పూట మాత్రమే అంత్యక్రియలు జరుపుతారట. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..

స్వలింగ సంపర్కులకు వారు మరణ సంకేతాలు ముందుగానే తెలుస్తాయంటా. దీంతో అప్పటి నుంచి వారు బయటకు వెళ్లడం మానేస్తారంట. అంతే కాకుండా మరణ సంకేతాలు తెలుసుకున్నప్పటి నుంచి ఆహారం కూడా తీసుకోవడం మానేసి కేవలం నీరు మాత్రమే తాగుతారట. ఇక తన కోసం ఇతర నపుంసకుల కొరకు దేవుడిని ప్రార్థిస్తారు. తదుపరి జన్మలో నపుంసకులుగా మారకూడదని ప్రార్థన చేసుకుంటారంట. ఇక వారి మరణం అనంతరం నపుంసకుల ఆచారం మేరకు వారి మృతదేహాలను సాధారణ వ్యక్తులు చూస్తే వారు వచ్చే జన్మలో కూడా ఇదే విధంగా పుడతారని నమ్ముతారు. అందుకే వారు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు అర్ధరాత్రి పూర్తి చేస్తారు. చనిపోయిన వ్యక్తి మృతదేహం వద్ద ఇతర నపుంసకులు నిలబడి అతని మోక్షానికి తమ దేవతకు కృతజ్ఞతలు తెలుపుతారు. కాగా.. నపుంసకులు చనిపోతే వారి మృతదేహానికి తెల్లని గుడ్డ చుట్టి కాల్చడానికి బదులుగా ఖననం చేస్తారు.

Next Story

Most Viewed