‘ఆమె’ అని ప్రేమించాడు కానీ..చివరికి ఏమైందంటే?

by Disha Web Desk 18 |
‘ఆమె’ అని ప్రేమించాడు కానీ..చివరికి ఏమైందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా వచ్చాక మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నాము. ఇంట్రెస్టింగ్ విషయాలు, వైరల్ వీడియోస్ ఇలా ఎన్నో విషయాలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఫ్రెంచ్ మాజీ దౌత్యవేత్త బెర్నార్డ్ బౌర్సీకాట్ లవ్ స్టోరీ తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకి వెళితే.. ఫ్రెంచ్ మాజీ దౌత్య వేత్త బెర్నార్డ్ బౌర్సీకాట్, చైనా స్పైషీ పెయిపూతో 1964లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక నటుడైన షీ మహిళగా తమ శరీరాకృతిని మార్చుకోవడంతో బెర్నార్డ్ ప్రేమించాడు. అయితే ఆమె అమ్మాయి కాదు, అతను అని తెలియడంతో.. వీరి రిలేషన్ గురించి తెలుసుకున్న చైనా, బెర్నార్డ్‌ను బెదిరించి కీలక సమాచారం సేకరించింది. 1983లో ఇది గ్రహించిన ఫ్రెంచ్ రక్షణ శాఖ ఇద్దరికీ 6 సంవత్సరాల శిక్ష విధించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Next Story

Most Viewed