స్కూల్ బస్సులో భారీ కొండచిలువ.. బిత్తరపోయిన గ్రామస్తులు (వీడియో)

by Disha Web Desk 21 |
స్కూల్ బస్సులో భారీ కొండచిలువ.. బిత్తరపోయిన గ్రామస్తులు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలీలోని ఓ స్కూల్ బస్సులో భారీ కొండచిలువను రెస్క్యూ టీమ్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాయ్‌బరేలీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌ శనివారం సెలవు కావడంతో స్కూల్ బస్సును పాఠశాల సమీపంలో ఉంచారు. అయితే అనుకోకుండా అతి పెద్ద కొండచిలువ మేక పిల్లను తిని.. ఆపై పక్కనే ఉన్న బస్సులోకి ప్రవేశించిందని స్థానిక గ్రామస్తులు చెప్పడంతో.. నగర మేజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అటవీశాఖ రెస్క్యూ బృందానికి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన బృందం పొడవైన కొండచిలువను ఏవిధంగా పట్టుకుంటున్నారో వీడియోలో చూడవచ్చు. అయితే ఆ పాము బస్సు ఇంజిన్‌లో ఇరుక్కుపోవడంతో.. దానిని ఎంత చాకచక్యంగా బయటకు తీసారో కనిపించింది. ఇక ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారిని మిశ్రా తెలిపారు. అనంతరం.. ఆ బస్సును పాఠశాల ముందు తీసుకెళ్లి పెట్టడం జరిగింది.


Next Story