కొడుకు పరీక్షకు స్లిప్పులు ఇస్తూ పోలీసులకు చిక్కిన తండ్రి (వీడియో)

by Disha Web Desk 7 |
కొడుకు పరీక్షకు స్లిప్పులు ఇస్తూ పోలీసులకు చిక్కిన తండ్రి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పరీక్షల సమయం దగ్గర పడుతున్న తరుణంలో పిల్లలను తల్లిదండ్రులు దగ్గరుండి చదివిస్తారు. మార్కులు రాకుంటే కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ ఉత్తమ తండ్రి తన కొడుకు పబ్లిక్ పరీక్ష రాస్తుంటే అతడికి స్లిప్‌లు అందించేందుకు ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్లి పోలీసులకు చిక్కాడు. ఈ విచిత్ర సంఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జల్గాన్ జిల్లా చోప్రా తహసీల్ అడవాడ్ గ్రామంలో నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో మరాఠీ పరీక్ష జరుగుతుంది. అయితే.. తన కొడుకు కూడా ఇదే సెంటర్‌లో పరీక్ష రాస్తుండటంతో అతడికి సహాయం చేయాలని ఓ తండ్రి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. కొన్ని స్లిప్పులు పట్టుకుని కొడుకు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాడు.

తన కొడుకు ఉన్న గది కోసం వెతుకుతుండగా విదుల్లో ఉన్న పోలీసులు చూసి అతడిని అక్కడ నుంచి పంపించేశారు. కొంచెం సేపు తర్వాత మళ్లి వచ్చి స్లిప్పులు ఇచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకున్నారు. పోలీసుల నుంచి ఆ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఎన్ని సార్లు చెప్పిన వినకుండా స్లిప్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తండ్రిని లాఠితో కొట్టారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed